భారతదేశం, ఆగస్టు 9 -- సూపర్ స్టార్ కృష్ణ‌ తనయుడిగా చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. తండ్రి నట వారసత్వాన్ని నిలబెడుతూ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 2001లో వచ్చిన 'మురారి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ మూవీతోనే అతని దశ కూడా తిరిగింది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే దిశగా అడుగులు వేసింది ఈ సినిమా. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.

2003లో వచ్చిన ఒక్కడు సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశారు మహేష్ బాబు. ఆ మూవీలో కబడ్డీ ప్లేయర్ గా, అమ్మాయిని విలన్ల నుంచి కాపాడే హీరోగా యాక్టింగ్ తో దుమ్ము లేపారు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిచింది. అగ్ర కథానాయకుడిగా ఎదిగేలా మహేష్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన మూవీ ఇది. ఇది జీ5 ఓటీటీలో ఉంది.

తెలుగు సినీ చరిత్రలో ఆధునిక క్లాసిక్ సినిమాల్...