భారతదేశం, జూలై 5 -- మహీంద్రా అండ్ మహీంద్రా తమ XEV 9e, BE 6 ప్యాక్ 2 డెలివరీలను జులై చివరి నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. కస్టమర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, కంపెనీ ఈ ఎలక్ట్రిక్​ కార్లకు చెందిన ప్యాక్ 2లో భాగంగా పెద్దదైన 79 kWh బ్యాటరీని కూడా పరిచయం చేసింది. అంతేకాదు, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు తమ 59 kWh బ్యాటరీ ప్యాక్‌ను 79 kWh యూనిట్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కూడా మహీంద్రా కల్పిస్తోంది.

59 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన BE 6 ప్యాక్ 2 ధర రూ. 21.90 లక్షలు కాగా, 79 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ. 23.50 లక్షలు (అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు). XEV 9e ప్యాక్ 2 విషయానికి వస్తే, 59 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ. 24.90 లక్షలు, 79 kWh వెర్షన్ ధర రూ. 26.50 లక్షలు (అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు). ఈ ధరల్లో ఛార్జర్, ఇన్‌స్టాలేషన్ ధరలు చేరవు. కస్టమర్‌లు 7.2 k...