Hyderabad, సెప్టెంబర్ 12 -- చనిపోయిన పూర్వికులను పితృ దేవతలుగా భావిస్తారు. అమావాస్య నాడు పితృదేవతలను స్మరించి తర్పణాలు వదులుతారు. అదే విధంగా పితృపక్షం 15 రోజులు కూడా పూర్వీకుల పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం, తర్పణాలు వదలడం లాంటివి చేస్తారు. పితృపక్షంలో పితృదేవతలకు చేసే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వదలడం వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. వంశాభివృద్ధి కలిగేలా చేస్తాయి. చనిపోయిన వారికి ఉపకారం చేయడానికి ఉన్న ఏకైక రోజే ఈ మహాలయ అమావాస్య.

మహాలయ పక్షంలో అమావాస్య నాడు శ్రాద్ధ కర్మలు జరిపితే సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టిన ఫలితం ఉంటుంది. ఎంతో ఎక్కువ ఫలితం వస్తుంది. మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య నాడు చేసే పిండప్రధానం, దానధర్మాలకు ఎంతో ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు పితృపక్షంగా పంచాంగాలు తెలుపుతున్నాయి. ఇక మహాలయ పక్షం ప్రాశస్త్యం తెలుస...