భారతదేశం, అక్టోబర్ 8 -- అమావాస్య తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో కూడా ఒక అమావాస్య వస్తుంది. అమావాస్య అంటే పూర్వికులను స్మరించుకుని తర్పణాలు సమర్పించడం, అన్నదానాలు చేయడం, వస్త్రదానాలు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన వాటిని వారు అనుసరిస్తూ ఉంటారు. అయితే, ఎప్పుడూ వచ్చే ఈ మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది.

మహాలయ అమావాస్య నాడు చాలా మంది పూర్వికులను తలుచుకుని మంచి పనులు చేస్తూ ఉంటారు. నిజానికి, మహాలయ అమావాస్యను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఇంతకీ ఈ మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీతో, సమయంతో పాటుగా ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు, పాటించాల్సిన పరిహారాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

2026లో మహాలయ అమావాస్య శనివారం, అక్టోబర్ 10న వచ్చింది. అమావాస్య తిథి అక్టోబర్ 9 రాత్రి స...