భారతదేశం, జూలై 18 -- ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని, ఏ సమస్య లేకుండా ఆనందంగా జీవించాలని అనుకుంటారు. అయితే, ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ఈ పరిహారాలను పాటించడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు కూడా లోటు ఉండదు.

హిందూ వైదిక సంప్రదాయంలో దీపం వెలిగించడం అనేది శుభానికి, పవిత్రతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే, దీపం వెలుగు అనేది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకొస్తుందని విశ్వాసం.

చాలా మంది ఉదయం పూట పూజలు చేసి దీపారాధన చేస్తూ ఉంటారు. సాయంత్రం కూడా దీపం వెలిగించడం మంచిదే. సనాతన ధర్మంలో సాయంత్రం వేళ మహాలక్ష్మీదేవి ...