భారతదేశం, జూలై 20 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 965 పాయింట్లు పెరిగి 78,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 262 పాయింట్లు వృద్ధిచెంది 24,334 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 939 పాయింట్లు పెరిగి 58,521 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 376.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,017.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

మార్కెట్​లు పెరుగుతన్నప్పటికీ, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నాయని, ట్రేడర్లు- మరీ ముఖ్యంగా బిగినర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల...