భారతదేశం, అక్టోబర్ 3 -- బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను కాపీ కొట్టిందనే ట్రోల్స్ వస్తున్నాయి. గురువారం (అక్టోబర్ 2) ప్రియాంక తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసిన అదే నాలుగు ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను ఊర్వశి మళ్లీ షేర్ చేసింది. ప్రియాంక చోప్రా పోస్టులను కాపీ చేసిందని ఊర్వశిపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

ప్రియాంక చోప్రా ప్రఖ్యాత ప్రైమాటాలజిస్ట్ జేన్ గుడాల్, దసరా, గాంధీ జయంతి గురించి స్టోరీలు పెట్టింది. ఊర్వశి రౌతేలా అదే విషయాలను ఎంచుకోవడమే కాకుండా, అవే పోస్టులను మళ్లీ షేర్ చేసింది. రెడ్డిట్, సోషల్ మీడియా యూజర్లు ప్రియాంక, ఉర్వశి స్టోరీల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు.

దీనిపై స్పందిస్తూ ఓ యూజర్ "పిన్న వయస్సులోనే అత్యంత అందమైన ఐఐటీయన్ అందాల పోటీ విజ...