భారతదేశం, డిసెంబర్ 18 -- శ్రీశైలం ఆలయ కార్యనిర్వాహక అధికారి(ఈఓ) ఎం. శ్రీనివాసరావు ఆలయ సిబ్బంది, ఉద్యోగులు భక్తుల సౌకర్యార్థం ఆలయం అందించే ఆన్‌లైన్ సేవలను ప్రచారం చేయాలని కోరారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆన్‌లైన్ సేవల అమలుపై శ్రీనివాసరావు.. ఆలయ విభాగాధిపతులు, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు.

దర్శనం, వసతి కోసం భక్తులు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని ఈఓ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి సేవలను ఆన్‌లైన్‌లో చేసినట్లు తెలిపారు. 'స్పర్శ దర్శనం, అతి శీఘ్ర దర్శనం రూ.300, రూ,150 శీఘ్ర దర్శనం టిక్కెట్లు బుక్ చేయవచ్చు. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్ర హోమం, మహా మృత్యుంజయ హోమం, కల్యాణోత్సవం, అన్నప్రాసన వంటి 14 ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.' అని ఈఓ చెప్పారు.

ప్రతి ఉద్యోగి, అధికారి భక్తులకు ఇబ...