Hyderabad, ఆగస్టు 24 -- అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తెలుగులో దేవర సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్‌లో పరమ్ సుందరి అనే సినిమా చేస్తోంది. అయితే, ఇటీవల పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిపై కేరళకు చెందిన పలువురు నటీనటులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పరమ్ సుందరి సినిమాలో అచ్చ మలయాళ అమ్మాయిగా జాన్వీ కపూర్ పాత్ర ఉంది. ఇదే మలయాళీను ఎక్కువగా అభ్యంతరానికి గురి చేసిన విషయం. పరమ్ సుందరి సినిమా, అందులో జాన్వీ కపూర్ యాసపై మలయాళీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పలువురు నటీనటులు ఓపెన్‌గా జాన్వీ కపూర్‌ను తప్బుబట్టారు.

నార్త్‌కు చెందిన జాన్వీ కపూర్‌ను పరమ్ సుందరి సినిమాలో మళయాల యువతిగా చూపించడాన్ని మలయాళ నటి, గాయని పవిత్ర మీనన్‌తోపాటు కంటెంట్ క్రియేటర్ స్టె...