Hyderabad, ఆగస్టు 26 -- ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి సమర్పణలో తెరకెక్కిన తెలుగు లేటెస్ట్ ఫిల్మ్ త్రిబాణధారి బార్బరిక్. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల ఈ సినిమాను నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ ప్రముఖ పాత్రలు పోషించారు.

ఆగస్ట్ 29న థియేటర్లలో త్రిబాణధారి బార్బరిక్ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల పంచుకున్నారు.

-నేను నా వ్యాపారాలతో బిజీగా ఉండేవాడిని. ఓ సారి ఈ కథను విన్నాను. మోహన్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ముందుగా చిన్న బడ్జెట్‌తో మూవీని తీయాలని అనుకున్నాం. ఆ తరువాత మారుతి గారిని కలిశాను. తీస్తే సినిమా బాగా తీయండి.. లేదంటే లేదు అని...