భారతదేశం, నవంబర్ 8 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు సహజంగా ఏర్పడతాయి. రాశులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ప్రభావాన్ని చూపిస్తాడు రాహువు. శుభస్థానంలో ఉంటే శుభ ఫలితాలను, అశుభ స్థానంలో ఉంటే సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రాహువుకి ఉండే ప్రత్యేకత, ప్రాముఖ్యత ఎంతో ఉంది. రాహువు మంచి స్థానంలో ఉంటే మాత్రం ఆ రాశి వారికి ఇక పండగే. అదే నీచ స్థానంలో ఉంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మరో 15 రోజుల్లో రాహువు సంచారంలో మార్పు చోటు చేసుకోబోతోంది.

గ్రహాల సంచారం, గ్రహాల కలయిక సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. త్వరలోనే రాహువు సంచారంలో మార్పు చేయనుంది. చాలా నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు ఒకటి. నవంబర్ 23న చూసుకున్నట్లయితే రాహువు నక్షత్ర సంచారం జరగనుంది. ఇలా రాహువు నక...