భారతదేశం, ఆగస్టు 17 -- మరో ఓటీటీలోకి మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'మురా' (Mura) రాబోతుంది. హృదయు హరూన్ తొలి మలయాళ చిత్రం మురా త్వరలోనే మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి పలు భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మురా మూవీ మరో ఓటీటీలోకి వస్తుంది. ఆగస్టు 29 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మహ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా 2024 నవంబర్లో థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ సినిమా డిసెంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టింది. సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టు 29న అర్ధరాత్రి 12 గంటల నుంచి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

మురా సినిమా థియేటర్లో సత్తాచాటింది. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. చాలా మంది కొత్త నటీనటు...