భారతదేశం, సెప్టెంబర్ 19 -- జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఎప్పుడొస్తుందనేది కూడా తేలిపోయింది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత జూనియర్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇది ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటికి డెబ్యూ మూవీ.

జూనియర్ మూవీ ఇప్పటికే ఆహా ఓటీటీలోకి రాబోతుందనే సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ పోస్టర్ పంచుకుంది. కమింగ్ సూన్ అంటూ అనౌన్స్ చేసేసింది. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు జూనియర్ సినిమా మరో ఓటీటీలోకి కూడా రాబోతుంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

కిరీటి, శ్రీలీల జంటగా నటించిన జూనియర్ మూవీ మరో ఓటీటీలోకి కూడా రాబోతుంది. సెప్టెంబర్ 22 నుంచి నమ్మఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇద...