భారతదేశం, డిసెంబర్ 26 -- ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ గ్వాలియర్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రేక్షకుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాన్సర్ట్ జరుగుతుండగా జనం బ్యారికేడ్లు దూకి స్టేజ్ మీదకు రావడంతో అతడు సీరియస్ అయ్యాడు. "పశువుల్లా ప్రవర్తించకండి" అంటూ మండిపడి షోను మధ్యలోనే ఆపేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సింగర్లు కాన్సర్ట్స్ చేయడం సహజమే. వీటిలో కొన్నిసార్లు ఫ్యాన్స్ హద్దు మీరుతుంటారు. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కానీ అక్కడ జరిగిన రచ్చ వల్ల అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. పాటలు పాడుతుండగా ప్రేక్షకులు అదుపు తప్పడంతో షో రసాభాసగా మారింది.

గ్వాలియర్ మేళా గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో కైలాష్ ఖేర్ పాడుతుండగా...