భారతదేశం, జూలై 29 -- ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంది అవతార్ 3. ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ నుంచి ట్రైలర్ వచ్చేసింది. సోమవారం (జులై 28) రాత్రి రిలీజైన ఈ ట్రైలర్ మరింత విజువల్ వండర్ గా ఉంది. ఇందులో కొత్త తెగలను ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.

అవతార్ అంటేనే విజువల్స్ కు పెట్టింది పేరు. గ్రాండ్ విజువల్స్ కు ఈ మూవీస్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ట్రైలర్ లో పండోరా గ్రహంపై యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయాయి. సైన్స్ ఫిక్షన్ ఎపిక్ పూర్తి స్థాయి ట్రైలర్ బయటకు రావడంతో పండోరా తర్వాతి అధ్యాయంపై ప్రేక్షకులకు మంచి గ్లింప్స్ లభిస్తోంది. తీవ్రమైన వైమానిక సన్నివేశాలు, ...