Hyderabad, ఆగస్టు 27 -- బాలీవుడ్ యాక్టర్ గోవిందా, అతని భార్య సునీతా అహుజా మధ్య గొడవలు వచ్చాయని రీసెంట్ గా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సునీత విడాకుల కోసం అప్లై చేశారని చాలా రిపోర్ట్స్ చెప్పాయి. కానీ బుధవారం (ఆగస్టు 27) రోజున గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ ఈ జంట ఈ రూమర్స్‌ని కొట్టిపారేశారు. మీడియాతో మాట్లాడిన సునీత.. గోవింద ఎప్పటికీ తన భర్తే అని, వాళ్ళ రిలేషన్ షిప్ ని ఎవరూ బ్రేక్ చేయలేరని అన్నారు.

గోవిందా, సునీత బుధవారం (ఆగస్టు 27) గణేష్ చతుర్థి కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత సునీత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమపై వస్తున్న పుకార్లను ఆమె ఖండించారు. "ఈరోజు ఇంత క్లోజ్‌గా ఉన్నాం.. ఒకవేళ ఏదైనా గొడవ ఉండుంటే, మేమింత దగ్గరగా ఉండేవాళ్ళమా? మా మధ్య దూరం ఉండేది. ఎవరూ మమ్మల్ని వేరు చేయలేరు.

పైన ఉన్న దేవుడు వచ్చినా లేదంటే ఏ దెయ్యం వ...