భారతదేశం, డిసెంబర్ 25 -- బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘోరాన్ని ఆమె మారణకాండగా అభివర్ణిస్తూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ మొత్తం మౌనంగా ఉన్న వేళ.. జాన్వీ ధైర్యంగా స్పందించడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌లో 27 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను ఒక మూక దారుణంగా హత్య చేసిన ఘటనపై జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రూపంలో ఉన్నా సరే అతివాదాన్ని ఖండించాల్సిందేనని ఆమె పిలుపునిచ్చింది. గురువారం (డిసెంబర్ 25) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "దీపు చంద్ర దాస్" అనే టైటిల్‌తో జాన్వీ ఒక నోట్ రాసుకొచ్చింది.

"బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అనాగరికం. ఇది కేవలం ఒక సంఘటన కాదు.. ఇదొక మారణకాండ. ఆయన్ని నడిరోడ్డుపై అంత దారుణంగా చంపి తగలబెట్టారు. ఆ వీడ...