భారతదేశం, ఆగస్టు 2 -- జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు పాట అదరగొట్టింది. తెలంగాణ సాహిత్యం సగర్వంగా తలెత్తుకుంది. 2023కి గాను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో 'బలగం' సినిమాలోని 'ఊరు పల్లెటూరు' పాట పురస్కారం దక్కించుకుంది. ఆ పాట సాహిత్యానికి గాను కాసర్ల శ్యామ్ 'బెస్ట్ లిరిసిస్ట్' అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ లిరిక్స్ మీకోసం.

2023లో వచ్చిన బలగంలోని 'ఊరు పల్లెటూరు' సాంగ్ పల్లెటూరి ఆత్మను ఆవిష్కరించింది. ఆ పాటలోని ఉన్న కేవలం పదాలు మాత్రమే కాదు తెలంగాణ గ్రామాల్లోని బతుకులు. వేణు యెల్దండి డైరెక్షన్ లో వచ్చిన బలగం ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ మరింత బలాన్ని అందించింది. ఊరు పల్లెటూరు పాటను మంగ్లీ, రామ్మిరియాల అద్భుతంగా పాడారు.

ఓరి వారి.. ఇంక పిండుతున్నావురా పాలు..

ఇం...