భారతదేశం, మార్చి 12 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది.

కేతువు క్రూర గ్రహం. కానీ ఒక్కోసారి కేతువు కూడా శుభ ఫలితాలను తీసుకొస్తూ ఉంటుంది. మార్చి 29న కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. కేతువు నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఎనిమిది నెలల పాటు ఈ రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

సింహ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపారులకు ఇది అద్భుత సమయం. విజయాలను అందుకుంటా...