Hyderabad, జూన్ 27 -- టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' భారీ అంచనాల మధ్య నేడు (జూన్ 27) థియేటర్స్‌లో రిలీజ్ అయింది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించారు.

కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జోడీగా తమిళ బ్యూటి ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేయగా.. మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధుబాల, బ్రహ్మానందం తదితర స్టార్స్ యాక్ట్ చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున కన్నప్ప మూవీని రిలీజ్ చేయగా ప్రీమియర్స్‌ నుంచి మంచి స్పందన రాబట్టింది. ఇక ఇవాళ విడుదలైన కన్నప్ప సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ వస్తోంది. మంచు విష్ణుతోపాటు ఇతర నటీనటుల యాక్టి...