Hyderabad, ఆగస్టు 7 -- మంచు వారమ్మాయి లక్ష్మి మంచు, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. నువ్వు అసలు తెలుగునేనా అంటూ అర్హ అడగడం, దానికి లక్ష్మి పడీపడీ నవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.

లక్ష్మి మంచు ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో నుంచి తెలుగు ప్రేక్షకులకు ఓ డౌట్ ఉండేది. ఆమె ఇంటర్వ్యూలో పూర్తిగా అమెరికన్ యాక్సెంట్ లో తెలుగు కూడా మాట్లాడటంతో ఆశ్చర్యపోయేవారు. తాజాగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా తన ఇంటికి వచ్చిన లక్ష్మిని ఇదే ప్రశ్న అడిగింది. ఈ మధ్యే బన్నీ ఇంటికి మంచు లక్ష్మి వెళ్లింది. అప్పుడు అర్హతో ఆమె సరదాగా ఆడుకుంది. నువ్వు నన్ను ఏదో అడగాలని అనుకున్నావట కదా.. అదేంటి అని అర్హను లక్ష్మి అడుగుతుంది. లక్ష్మితో అర్హ మాట్లాడుతూ న...