Hyderabad, సెప్టెంబర్ 20 -- పెళ్లయిన ప్రతి స్త్రీ మెడలో మంగళసూత్రం, చేతికి గాజులు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు, నల్లపూసలు ఉండేటట్టు చూసుకుంటారు. హిందూ సంస్కృతిలో మంగళసూత్రానికి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. పెళ్లి జరిగేటప్పుడు మంగళ సూత్రాలను మహిళలు కొలుస్తారు. ఆ తర్వాత భర్త మూడు ముళ్లు వేస్తారు. అయితే, ఎంతో పవిత్రంగా, గౌరవంగా చూసుకునే మంగళ సూత్రం విషయంలో చాలా మంది మహిళలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ప్రతి రోజు మహిళలు మంగళ సూత్రాన్ని కళ్లకు అద్దుకుని ఆ తర్వాత నిద్రలేవాలి.

అలా మంగళ సూత్రాన్ని కళ్లకు అద్దుకొని నిద్రలేచినట్లయితే భర్త ఆయుష్షు పెరుగుతుంది. అయితే, ఎంతో పవిత్రమైన మంగళ సూత్రానికి చాలా మంది మహిళలు పిన్నీసులు గుచ్చుతూ ఉంటారు. ఇతర వస్తువులను కూడా సౌకర్యవంతంగా ఉంటుందని పెడతారు.

కానీ, నిజానికి మంగళ సూత్రానికి పిన్నీసులు పెట్ట...