భారతదేశం, అక్టోబర్ 1 -- థియేటర్లలో విడుదలైన కేవలం నెల రోజుల్లోపే తమిళ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మదరాసి ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 1) డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఏఆర్ మురగదాస్ డైరెక్టర్.

శివకార్తికేయన్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మదరాసి ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా ఒక రోజు ముందే నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. బుధవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది మదరాసి. శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమాల్, బిజు మీనన్, విక్రాంత్, షబీర్ కల్లరక్కల్ తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 1 నుండి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంతో సహా 200 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాలలో ఉన్న ప్రైమ్ సభ్యులు మదరాసిని తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల...