భారతదేశం, ఆగస్టు 1 -- ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో రూ.4,727 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించారు.

ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం నూతన టెర్మినల్ భవనంలో కలియతిరిగిన ప్రధాని మోదీ, ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యాధునిక మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. చెక్-ఇన్ హాల్స్, ఎయిర్‌పోర్ట్ విశిష్ట డిజైన్, వాడిన వినూత్న సాంకేతికతల గురించి జీఎమ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు ...