భారతదేశం, డిసెంబర్ 14 -- ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గృహ హింస కేసులో భాగంగా ఒక వ్యక్తి తనతో విడిపోయిన భార్యను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని తన మోటార్‌సైకిల్‌పై ఉంచి పోలీస్ స్టేషన్‌ తీసుకొచ్చి లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నిరంతరం గొడవల కారణంగా మహాలక్ష్మి వెంకటేశ్వర్లు నుంచి విడిపోయింది. వేరుగా ఉంటుంది. తన బతుకు తాను బతుకుతుంది.

ఆదివారం నాడు, వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి మహాలక్ష్మిని కలిశాడు. బంగారం ఇస్తానని చెప్పి గ్రామ శివార్లకు తనతో పాటు తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ త...