భారతదేశం, జూలై 28 -- ఇప్పుడు ఓ తమిళ నటుడు తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అతని పేరు ట్రెండ్ అవుతోంది. మొదటి భార్య, పిల్లలు ఉండగానే అతను రెండో పెళ్లి చేసుకోవడం, వివాహమైన వెంటనే ఆమె ఆరు నెలల గర్భవతి అని ప్రకటించడమే ఇందుకు కారణం. నటుడ, చెఫ్ మదాంపట్టి రంగరాజ్.. స్టైలిస్ట్ జాయ్ క్రిజిల్డాతో తన ఆశ్చర్యకరమైన వివాహంతో వార్తల్లో నిలిచారు. కొన్ని గంటల్లోనే, తాము బిడ్డను ఆశిస్తున్నట్లు దంపతులు ప్రకటించారు.

మదాంపట్టి రంగరాజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. స్టైలిస్ట్ జాయ్ క్రిజిల్డాను గుడిలో వివాహమాడాడు. అయితే రంగరాజ్ మొదటి భార్య శృతి రంగరాజ్ చేసిన వాదనల కారణంగా ఈ ప్రకటన వివాదానికి దారితీసింది. ఆదివారం (జులై 27) స్టైలిస్ట్ జాయ్‌, రంగరాజ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేడుకకు సంబంధించిన ఫోటోలను జాయ్ పంచుకుంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో "మ...