Hyderabad, ఆగస్టు 7 -- రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ మూవీ రన్ టైమ్ ఎంతో తేలిపోయింది. ఈ సినిమా ఏకంగా 2 గంటల 50 నిమిషాల పాటు ఉండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన గత సినిమాల్లాగే లోకేష్ ఈ మూవీని కూడా చాలా ఎక్కువ రన్ టైమ్ తోనే తీసుకొస్తున్నాడు.

కూలీ మూవీ ఫైనల్ రన్ టైమ్ ఎంతో తేలిపోయింది. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ తోపాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది. ఈ సినిమాలో ఉన్న నటీనటులు, డైరెక్టర్ కారణంగా ఇంత భారీ రన్ టైమ్ కూడా సరైనదే అన్న వాదన వినిస్తోంది. పైగా లోకేష్ కనగరాజ్ సినిమాల అన్నీ ఇలా చాలా ఎక్కువ రన్ టైమ్ తో రావడం కామనైపోయింది.

లోకేష్ కనగరాజ్ ను తమిళంలో ఉన్న రాజమౌళిగా రజనీకా...