భారతదేశం, నవంబర్ 10 -- జమ్ము కశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఫరీదాబాద్ పోలీసులు సమన్వయంతో పనిచేసి ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు! హరియాణా ఫరీదాబాద్‌లో ధౌజ్ గ్రామంలోని అద్దె ఇంట్లో నుంచి సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలు, ఒక ఏకే-47 రైఫిల్, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

జమ్ముకశ్మీర్‌లో అరెస్టయిన అనుమానితుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఆదివారం నాడు అధికారులు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు.

పేలుడు పదార్థాలను డాక్టర్ ముజాహిల్ షకీల్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. షకీల్ స్వస్థలం జమ్ముకశ్మీర్. అతను అల్ ఫలహ్ మెడికల్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నాడు. సుమారు మూడు నెలల క్రితం అతను ధౌజ్‌లో ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు అధికారుల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న వాటిలో 100 కిలోల బరువున్...