భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి 'సుంకాల' దాడి చేశారు. రష్యా నుంచి నిరంతరాయంగా చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు 'భారత్‌కు శిక్ష' అంటూ.. అదనంగా 25 శాతం టారీఫ్ని విధించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఫలితంగా.. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పుడు మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. ఈ అదనపు సుంకం 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఉన్న సుంకాలు ఆగస్టు 7న, అంటే గురువారం అమల్లోకి రానున్నాయి.
ఈ అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులకు భారీగా ధర పెరుగుతుంది. దీని ప్రభావం ముఖ్యంగా ఆటో విడిభాగాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఉంటుంది.
ఉక్కు, రసాయనాలు, ఫార్మా రంగాలపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిశ్రమలు భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.