భారతదేశం, నవంబర్ 11 -- టాటా హారియర్ ఈవీకి భారతదేశం అంతటా బలమైన డిమాండ్ కనిపిస్తోంది! దీని కారణంగా, కొన్ని వేరియంట్‌లకు డెలివరీ సమయం బాగా పెరిగింది. ముఖ్యంగా బేస్ అడ్వెంచర్ వేరియంట్​కు ప్రస్తుతం 2.5 నుంచి 3 నెలల వరకు (సుమారు 10 నుంచి 12 వారాలు) అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ మధ్యస్థాయి వేరియంట్‌ను 1 నుంచి 2 నెలల్లో డెలివరీ చేయవచ్చని అంచనా వేయగా, టాప్-ఎండ్ ట్రిమ్ కొనుగోలుదారులను చేరుకోవడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది.

టాటా హారియర్ ఈవీ మొత్తం ఐదు కీలక వేరియంట్‌లలో అందుబాటులో ఉంది:

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధరలు రూ.21.49 లక్షల నుంచి రూ. 30.23 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ప్రతి వేరియంట్ టెక్నాలజీ, ఫీచర్లు, డిజైన్ ఎలిమెంట్స్​ ప్రత్యేక కలయికను అందిస్తుంది. పట్టణ ఈవీ కొనుగోలుదారులకే కాకుండా, బలమైన ఎలక్ట్రిక్ పనితీరు...