భారతదేశం, ఆగస్టు 27 -- భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజై ఓ మోస్తారు ప్రదర్శన చేసిన విజయ దేవరకొండ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్' (Kingdom) ఓటీటీలోకి వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా ఇవాళ (ఆగస్టు 27) డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. అర్ధరాత్రి నుంచే మూవీ ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యాక్షన్ డ్రామా చిత్రం కింగ్డమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 27 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ''మొత్తం తగలపెట్టడానికి సూరి వచ్చేశాడు'' అనే క్యాప్షన్ తో పోస్టర్ షేర్...