భారతదేశం, డిసెంబర్ 12 -- మహానటి కీర్తి సురేష్, ఆమె చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ వివాహ బంధానికి నేటితో (డిసెంబర్ 12) ఏడాది పూర్తయింది. వారిద్దరూ గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ పెళ్లి వేడుకల్లోని అల్లరి, ఆనందం, కన్నీళ్లు కలగలిసిన ఒక బ్యూటిఫుల్ వీడియోను కీర్తి సోషల్ మీడియాలో పంచుకుంది.

నటి కీర్తి సురేష్, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా గతేడాది గోవాలో జరిగిన తమ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పెళ్లి వేడుకల వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. "ఒక ముఖ్యమైన రోజు.. ఒక ముఖ్యమైన జ్ఞాపకం.. మా పెళ్లికి ఏడాది" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది....