భారతదేశం, ఆగస్టు 11 -- ఇండియాలో ఆటోమొబైల్​ కస్టమర్లు ఇప్పుడు రేంజ్​తో పాటు ఇప్పుడు సేఫ్టీకి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కారు కొనే ముందు దాని భద్రతా ఫీచర్లను పోల్చి చూస్తున్నారు. అయితే దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ.. భద్రత విషయంపై అంతగా దృష్టి పెట్టదని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు గ్లోబల్ ఎన్​సీఏపీ, భారత్ ఎన్​సీఏపీలో అధిక రేటింగ్‌లు సాధిస్తుంటే, మారుతీ సుజుకీ మాత్రం భద్రతా ప్రమాణాలను పెంచడం లేదని చాలా మంది విమర్శించారు. ప్రస్తుతం మారుతీ సుజుకీ కార్లలో ఐదు-స్టార్ రేటింగ్ సాధించిన ఏకైక కారు కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ మాత్రమే! ఈ నేపథ్యంలో ఈ విమర్శలను సానుకూలంగా తీసుకున్న సంస్థ, తన పోర్ట్​ఫోలియోలోని వాహనాలను సేఫ్టీ ఫీచర్స్​తో అప్డేట్​ చేసేందుకు రెడీ అయ్యింది. 'నెక్సా సేఫ్టీ షీ...