భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఓటీటీలోకి ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంది. వివిధ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాయి. బోల్డ్, రొమాంటిక్, ఎరోటిక్ కంటెంట్ కూడా కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతోంది. ఇప్పుడు ఇలాంటి రొమాంటిక్ లోనే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఓ సిరీస్ వచ్చింది. ఇవాళ 'ది డెడ్ గర్ల్స్' సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది.

రొమాంటిక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'ది డెడ్ గర్ల్స్' వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మెక్సికన్ డ్రామా ఇవాళ (సెప్టెంబర్ 10) ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ సిరీస్ గా రూపొందిన ఈ థ్రిల్లర్ ఆ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే అడుగుపెట్టింది. ఈ సిరీస్ లోని ఆరు ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్ అయ్యాయి.

1960 కాలంలో మెక్సికో బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ సాగుతోంది. బలాడ్రో సిస్టర్స్ ఇద్దరు...