భారతదేశం, సెప్టెంబర్ 20 -- 2023కు గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ అందుకోనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం (సెప్టెంబర్ 20) ప్రకటించింది. తన నాలుగు దశాబ్దాల కెరీర్ లో 400 కి పైగా చిత్రాలలో నటించారు మోహన్‌లాల్‌. ప్రధానంగా మలయాళ చిత్రాల్లో యాక్ట్ చేశారు. దీంతో పాటు తమిళం, హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించారు.

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో అనౌన్స్ చేసింది. "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించడానికి సంతోషిస్తోంది. మోహన్ లాల్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 ను ప్రదానం చేయనున్నారు. మోహన్ లాల్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలుగా స్ఫూర్తినిస్తుంది. దిగ్గజ నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ స...