భారతదేశం, సెప్టెంబర్ 17 -- భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన సంబరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న వేళ ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ప్రధాని మోదీ బయోపిక్ రాబోతోంది. నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. ఇవాళ (సెప్టెంబర్ 17) మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ బయోపిక్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ పై ఇవాళ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ మూవీకి 'మా వందే' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్ ప్లే చేయనున్నాడు. అంటే రియల్ లైఫ్ లోని మోదీ పాత్రలో రీల్ లైఫ్ లో ఉన్ని ముకుందన్ కనిపిస్తాడు. ఈ మూవీ టైటిల్, ఇతర విషయాలను ఎక్స్ లో పంచుకున్నారు మేకర్స్. రీసెంట్ గా వచ్చిన మార్కోతో అదరగొట్టాడు ఉన్ని ముకుందన్.

భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన బయో...