Hyderabad, సెప్టెంబర్ 17 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 828వ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగిపోయింది. రేవతి వచ్చిందన్న సంతోషంలో ఉన్న దుగ్గిరాల కుటుంబంలో కావ్య గురించి నిజం చెప్పలేక అప్పు సతమతమవుతుంది. కానీ కల్యాణ్ ధైర్యం తెచ్చుకొని రాజ్ కు అసలు విషయం చెప్పడంతో అతని గుండె ముక్కలవుతుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ అప్పు, కల్యాణ్.. కావ్యకు ఈ నిజం ఎలా చెప్పాలా అని బాధపడుతున్న సీన్ తో మొదలవుతుంది. అప్పుడే డాక్టర్ ఆమెకు ఫోన్ చేస్తుంది. ఇంకా కావ్యకు నిజం చెప్పారా లేదా అని అడుగుతుంది. ఇవాళ పండగ కదా.. అందరూ సంతోషంగా ఉన్నారు.. తర్వాత చెబుతానని అప్పూ అనడంతో డాక్టర్ కోప్పడుతుంది.

పండగ పోతే మళ్లీ వస్తుంది ప్రాణం పోతే రాదు.. వెంటనే కావ్యకు నిజం చెప్పేయమని స్పష్టంగా చెబుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక అప్పూ ఏడుస్తుంటే.. తాను నిజం చ...