Hyderabad, సెప్టెంబర్ 16 -- బ్రహ్మముడి ఈరోజు అంటే 827వ ఎపిసోడ్ లో దుగ్గిరాల కుటుంబంలో ఓవైపు సంతోషం, మరోవైపు బాధ చూడొచ్చు. రేవతి తిరిగి తన కుటుంబానికి దగ్గరవడంతో అందరూ సంతోషిస్తారు. కానీ అటు కావ్య గుండె మాత్రం ముక్కలవుతుంది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ రేవతి ముసుగు తొలగిపోయిన తర్వాత రుద్రాణికి ఇందిరా దేవి క్లాస్ పీకే సీన్ తో మొదలైంది. తెలిసీ తెలియని వయసులో దానికి లేనిపోనివి నూరిపోసి పంపించింది నువ్వే కదా అని రుద్రాణిని ఇందిర తిడుతుంది. ఇప్పుడు రేవతి గురించి మాట్లాడిల్సింది కేవలం అపర్ణే అని, ఆమె క్షమించాలని అంటుంది.

అటు రాజ్ కూడా తల్లికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నా ఆపే వయసు అప్పట్లో తనది కాదని అంటాడు. ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ల తప్పులను కూడా ...