Hyderabad, సెప్టెంబర్ 15 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వినాయక చవితి వేడుకల్లో రుద్రాణి పార్టీ అరెంజ్ చేస్తుంది. రాహుల్, స్వప్న డ్యాన్స్ చేస్తారు. ప్రకాశం, ధాన్యలక్ష్మీ డ్యూయెట్ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తారు. అపర్ణ, సుభాష్‌కు మనసులో ఉన్న ప్రేమను చూపించాలని అని వస్తే స్వరాజ్ మీద ఉన్న ప్రేమను చూపిస్తారు. అది చూసి రేవతి ఎమోషనల్ అవుతుంది.

అప్పు, కల్యాణ్ డ్యాన్స్ చేస్తారు. రాజ్‌కు మొదటి ప్రేమను తెలియజేయాలి అని వస్తుంది. మీరు మొదట ప్రేమించింది మా అక్కను. అది నిజాయితీగా చెప్పండి అని కావ్య అంటుంది. ప్రేమ గొప్పదా, పెళ్లి గొప్పదా అని అందరిని అడిగిన రాజ్ పెళ్లి గురించి గొప్పగా చెబుతాడు. కావ్యతో జరిగిన పెళ్లి, తనను దూరం పెట్టడం, కావ్య తనకోసం రావడం వంటివి అన్ని గొప్పగా చెబుతాడు రాజ్.

నువ్విచ్చిన ప్రేమను పదింతలు చేసి ఇస్తాను. భవిష్యత్తులో కన్న...