భారతదేశం, ఫిబ్రవరి 25 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో రాహుల్ ను చంపేస్తాడు రాజ్. బాంబు పేలుడులో రాజ్, అపర్ణ, సుభాష్ తప్ప మిగిలిన అందరూ కన్నుమూసినట్లుగా ఈ ఎపిసోడ్ లో చూపించారు. రాహుల్ ను రాజ్ చంపడం చూసి వచ్చిన రుద్రాణి.. రాజ్ తోపాటు మిగిలిన వాళ్లను చంపడానికి వస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ బస్సులో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్న సీన్ తో మొదలైంది. అప్పు, కావ్య వచ్చి అక్క స్వప్నను కూడా కారులో నుంచి తీసుకెళ్తారు. దీంతో రాహుల్ కంగారు పడతాడు. తల్లికి ఫోన్ చేసిన జరిగిన విషయం చెప్పి ప్లాన్ మార్చమని అంటాడు.

కానీ రుద్రాణి వినదు. భార్య కావాలా, ఆస్తి కావాలా.. బంగ్లా బతుకు కావాలా, బానిస బతుకు కావాలా తేల్చుకో.. అయినా స్వప్నను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా.. ఈ త్యాగం తప్పదు అని చెప్పడంతో రాహుల్ సరే అంటాడు. దూ...