Hyderabad, జూలై 6 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో కంపెనీలో రాజ్ స్టాఫ్ అందరిని పిలిచి అల్లాడిస్తుంటాడు. ఒక్కొక్కరు రాజ్ మాటలకు భయపడిపోతుంటారు. కంపెనీ కోసం ఇలాగేనా పని చేయడం, శాలరీ తీసుకుంటూ ఇంతే చేస్తారా అంటూ ఏవోవో మాటలు మాట్లాడుతాడు రాజ్.

కావ్యకు కాల్ చేసి రాజ్ చేసేది శ్రుతి చెబుతుంది. కావ్య దారిలో కారులో వస్తున్నాని చెబుతుంది. అదంతా విన్న రాజ్ వెంటనే శ్రుతిని తిట్టి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమంటాడు. దాంతో శ్రుతి అలాగే చేస్తుంది. ఈయనేమో ఇలా ఇక్కడ రచ్చ చేస్తున్నాడు, ఆవిడ ఇంకా దారిలోనే ఉంది. ఏం జరుగుతుందో అని శ్రుతి భయపడిపోతుంది.

మరోవైపు రాహుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా గర్ల్‌ఫ్రెండ్‌తో పట్టుకుంటుంది స్వప్న. రాహుల్‌ను చీపురు కట్ట తిరగేసి మరి కొడుతుంది. తప్పించుకుందామని ప్రయత్నించిన రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఏడు వారాల నగలు కలెక్ట్...