Hyderabad, జూన్ 29 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో గతంలో రాజ్‌కు శత్రువు అయిన సిద్ధార్థ్‌ను పిలిపిస్తుంది యామిని. 40 శాతం షేర్స్ ఉన్న నువ్ రాజ్ కంపెనీని దక్కించుకునేందుకు చాలా ట్రై చేశావ్. కానీ, రాజ్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఆ ఎండీ సీటులో కావ్య ఉంది. కావ్య వల్ల కలిగే నష్టాలు, నీ వల్ల వచ్చే లాభాలు ఏంటో బోర్డ్ మీటింగ్ పెట్టి అందరికి అర్థమయ్యేలా చెప్పమని యామిని చెబుతుంది.

కంపెనీలో 40 శాతం షేర్స్ నీవే కాబట్టి సగానికిపైగా సభ్యులు నువ్వే బెస్ట్ అనుకుంటారు. దాంతో సీటు నీ వశం అవుతుంది. బోర్డ్ మీటింగ్‌లో కావ్య పతనం అవుతుంది అని రాజ్ శత్రువు అయిన సిద్ధార్థ్‌కు యామిని సలహా ఇస్తుంది. అలాగే, తన ప్లాన్ చెబుతుంది. దాంతో ఐడియా బాగుందని సిద్ధార్థ్ షేక్ హ్యాండ్ ఇచ్చి బోర్డ్ మీటింగ్ పెడతానని చెప్పి వెళ్లిపోతాడు.

ఇక మరుసటి రోజు ఉదయం మళ్లీ ...