Hyderabad, జూలై 13 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో అప్పును ఎలా ఇరికించారో మీలో ఎవరికైనా తెలుసా అని రుద్రాణి అంటే రాజ్ మంచి ఐడియా ఇచ్చారని అంటాడు. అప్పు అమాయకురాలు అనే గేమ్ ఆడుతారు. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందంను ఏదో ఒక కారణం చెప్పి కొట్టినట్లు ఇంటిల్లిపాది రుద్రాణి, రాహుల్‌ను కొడతారు.

దాంతో ఒల్లు హూనం అయిపోయింది, అనవసరంగా ఐడియా ఇచ్చి చచ్చాను ఇప్పుడు మన చావుకు వచ్చింది అని అక్కడి నుంచి పారిపోతారు రుద్రాణి, రాహుల్. దాంతో అంతా నవ్వుతారు. ఇంతలో కావ్య వాళ్లకు అప్పును ఇరికించిన శీను ఉండే ఏరియా పేరు రెహమత్ నగరు అని తెలుస్తుంది. అది వినగానే రేవతి అక్కను కలిసింది అదే ఏరియాలో కదా అని రాజ్ అంటాడు.

అవును రామ్ గారు అని కావ్య చెబుతుంది. ఆ శీను గాడు గురించి అక్కకు తెలిస్తే వాడిని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది కదా అని రాజ్...