Hyderabad, జూలై 7 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆఫీస్‌లో రాజ్ మాటలకు స్టాఫ్ అంతా భయపడుతున్నట్లు చెబుతారు. శ్రుతిని పిలిచి కొట్టబోతే భయంతో చెంపలు మూసుకుంటుంది. భయం అంటే ఇలా ఉండాలి అని రాజ్ అంటాడు. గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా భయపడుతున్న అని ఎంప్లాయ్ అంటాడు. దాంతో అతని గుండెలపై తల పెట్టి హార్ట్ బీట్ వింటాడు రాజ్.

ఇలా ఆఫీస్‌లో విచిత్రంగా, వింతగా ప్రవరిస్తాడు రాజ్. శ్రుతి వీళ్లకు నేనంటే భయం లేకుండా పోయింది. వీళ్లందరిని వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. మీరందరు ఫైర్ అని రాజ్ అంటాడు. ఇంతలో వచ్చిన కావ్య వచ్చి చప్పట్లు కొట్టి సూపర్ సర్ మీరు అని అంటూనే ఉంటుంది. మీరేం కంగారుపడకండి. ఇదంతా రాజ్ సర్ చేసిన ప్రాంక్ అని కవర్ చేసి అందరిని పంపించేస్తుంది కావ్య.

అసలు మీరేం చేస్తున్నారు. ముందు ఇంటికి పదండి అని రాజ్‌ను తీసుకెళ్తుంది కావ్య. నాకు...