Hyderabad, జూలై 5 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యకు తెలియకుండా ఆఫీస్‌కు రాజ్ వెళ్లి రచ్చ రచ్చ చేస్తాడు. రాజ్ ప్రవర్తన గురించి శ్రుతిని ఆఫీస్ ఉద్యోగులు అడుగుతారు. నోరుమూసుకుని వెళ్లి పని చేసుకోమ్మని చెబుతుంది శ్రుతి. ఇప్పుడు క్యాబిన్‌కు వెళ్తే ఏమంటారో.. పెళ్లి అయితే మొగుడికి కూడా ఇంత భయపడను. ఈయనకు భయపడాల్సి వస్తుందని శ్రుతి అంటుంది.

మరోవైపు అంతా భోజనం చేస్తుంటే గుమ్మం వైపు రుద్రాణి చూస్తుంటే కావ్య అడుగుతుంది. అంతా రుద్రాణిపై సెటైర్లు వేస్తారు. ఇంటి వారసుడు కోసం చూస్తున్నాను అని రుద్రాణి అంటుంది. రాజ్‌కు ట్రైనింగ్ ఇవ్వడం రుద్రాణి తొంగి తొంగి చూసినదాని గురించి కావ్య అడుగుతుంది. ఇంతలో రాహుల్ బయటకు వెళ్తుంటే పూలరంగడులా వెళ్తున్నావేంటీ అని కల్యాణ్ అడుగుతాడు.

అర్జంట్ మీటింగ్ ఉందని రాహుల్ వెళ్తాడు. రాహుల్ పాకెట్‌లో డాక్యుమెంట్స్ ...