Hyderabad, జూలై 4 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రామ్‌కు రాజ్‌ల తినడం నేర్పుస్తుంది కావ్య. అది చూసి రుద్రాణి అనుమానిస్తుంది. ఇదేదో పెద్ద ప్లానింగ్‌లోనే ఉంది. తెలుసుకోవాలి అని రుద్రాణి అంటుంది. తిన్న తర్వాత రిలాక్స్ అవ్వడం గురించి కావ్య చెబితే రామ్ కోప్పడతాడు. మీరే కదా మా బాస్‌లా చేస్తాను అన్నారు. వద్దంటే వదిలేయండి అని కావ్య అంటుంది.

రామ్ టైడ్ అయిపోయాను అంటే ఇంకా ఉంది. రేపు సిద్ధార్థ్‌తో జరిగే మీటింగ్‌లో పదేళ్ల ఆఫీస్ చరిత్ర, డీలింగ్స్ అన్ని మాట్లాడాలి అని కావ్య అంటుంది. కంపెనీ ఎండీ అంటే ఏదో వెళ్లి నాలుగు మాటలు మాట్లాడేసి వచ్చేయడమే అనుకున్నాను. ఇంత కష్టంగా ఉంటుందని అస్సలు అనుకోలేదని రాజ్‌గా చేస్తున్న రామ్ అంటాడు. మరి మా బాస్ ప్లేసులో నటించడం అంటే అంత ఈజీ అనుకున్నారా అని కావ్య అంటుంది.

ఆ మాటలు రుద్రాణి వింటుంది. హో ఇదా నీ ప్లాను....