Hyderabad, జూలై 1 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యకు కాల్ చేసిన యామిని సిద్ధార్థ్‌ను పంపించింది నేనే అని, అర్జంట్‌గా బోర్డ్ మీటింగ్ పెట్టించింది నేనే. ఈ ఒక్కదానికి షాక్ అయితే ఎలా. నీకు ఇకనుంచి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తాను. నేను అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవించాలి. అందుకే నీకు ఈ శిక్ష విధించాను. నీకు మిగిలి ఉంది కేవలం రెండే రోజులు అని యామిని అంటుంది.

నీ పవర్స్ సిద్ధార్థ్ చేతులోకి వెళ్లకుండా ఎలా ఆపుతావ్ అని యామిని అంటుంది. నాకు 48 గంటలు కూడా కాదు ఒక్క మూమెంట్ దొరికినా నేను గెలుస్తాను అని కావ్య అంటుంది. నువ్ గెలవాలంటే ఒక్క దారి ఉంది. ఈ లోకానికి రాజ్ బతికి ఉన్నాడని నమ్మించాలి. అలా చేయాలంటే రామ్‌కు గతం చెప్పి రాజ్‌గా చూపించాలి. అలా చేయగలవా. లేదు. నీ కుటుంబంలో కూడా నీ స్థానం పోతుంది. ఉన్నన్ని రోజులు కంపెనీలో ఎంజాయ్ చేయు అని యామిని...