భారతదేశం, జూన్ 8 -- Brahmamudi June 8th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి (Brahmamudi) సీరియల్‌లో దుగ్గిరాల కంపెనీ సీఈవో కుర్చీ కోసం జరుగుతున్న పోరు రసవత్తరంగా మారింది. కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాకుండా, కార్పొరేట్ పాలిటిక్స్‌ను కూడా సీరియల్స్‌లో చూపించడం ఈ మధ్య కామన్ అయిపోయింది. సోమవారం (జూన్ 8) ఎపిసోడ్‌లో రాజు, రేఖల మధ్య జరిగిన బోర్డ్ మీటింగ్ ఫైట్, ఆఖరి నిమిషంలో ఇందు ఎంట్రీ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచాయి.

ఐశ్వర్యకు ఇందు తన ప్లాన్ చెప్పినా వినదు. అదంతా ఐశ్వర్య మంచికే అని ఇందు మొత్తుకున్నా ఆమె అస్సలు పట్టించుకోదు. అయితే ఈ తతంగాన్ని కిటికీలోంచి చూసిన తాగుబోతు నారాయణ, ఐశ్వర్యకు బుద్ధి చెప్పి ఇందును కాపాడాలని డిసైడ్ అవుతాడు. దీనికోసం మాస్టర్ ప్లాన్ వేస్తాడు.

ఆఫీసులో సీఈవో పోస్ట్ కోసం ఉత్కంఠ పెరుగుతుంది. రేఖ మీటి...