భారతదేశం, జూన్ 5 -- Brahmamudi June 5th Episode: స్టార్ మాలో ఒకప్పటి టాప్ సీరియల్ బ్రహ్మముడిలో కొత్త కొత్త ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. తాజా ఎపిసోడ్ లో ఇందు సీఈవో కాకుండా అడ్డుకోవడానికి ఐశ్వర్య ఆమెను కిడ్నాప్ చేస్తుంది. బోర్డు మీటింగ్ అయ్యే వరకు ఆమెను వదలనని భీష్మించుకుంటుంది. అటు రాజులో ఆందోళన మొదలవుతుంది.

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జూన్ 5) ఎపిసోడ్ సీఈవో పోస్ట్ తనే అన్న కాన్ఫిడెన్స్ లో రాజు సూటుబూటులో ఫొటోలకు పోజులిచ్చే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇందు వచ్చి లేటవుతుందని చెప్పడంతో రాజు వెంటనే రెడీ అవుతాడు.

అయితే ఇంతలో ఇందు దగ్గరికి వచ్చిన ఐశ్వర్య.. రాకేష్ తనను మళ్లీ బెదిరిస్తున్నాడని, కాపాడాలని అడుగుతుంది. తనకు బోర్డు మీటింగ్ ఉందని చెప్పినా వినదు. అరగంటలో పని పూర్తవుతుందని, నువ్వు చెబితే వాడు వింటాడని, తన వెంట రావాలని బతిమాలుతుంది. ...