Hyderabad, జూన్ 30 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాత్రి రాజ్, కావ్య మాట్లాడుకుంటారు. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలిసి తెలియనట్లు నటిస్తున్నారు. అది ఫోన్‌లో చెప్పను. మీరు కళ్లముందు ఉన్నప్పుడు చెబితే బాగుంటుంది. ఆ ఫీలింగ్ బాగుంటుంది. రేపటి వరకు వెయిట్ చేయండి అని రాజ్ అంటాడు.

నేను ఎదురుచూస్తుంటాను అని కావ్య అంటుంది. మీకు నేను ఏం చెబుతానో అర్థమై కూడా తెలియనట్లు ఉన్నారు. ఈ ఒక్కరాత్రి ఆగండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు చెప్పేస్తాను అని రాజ్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం నీకు ఇవాళ ఎంత అర్జంట్ వర్క్ ఉన్న నువ్వ వెళ్లకూడదు అని ఫోన్ లాక్కుంటారు అపర్ణ, ఇందిరాదేవి. వీలైనంత త్వరగా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తే అయిపోతుందని సుభాష్ అంటాడు.

అదంతా జరగదని రుద్రాణి మనసులో అనుకుంటుంది. అంతా కావ్య, రాజ్ కలవాలని కోరుకుంటున్నట్లు మాట్లాడుతార...